వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్‌ను నియమిస్తున్నట్లు ఆ దేశ సుప్రీంకోర్టు ప్రకటించింది. వెనిజులా రాజధాని కారకాస్‌పై దాడి చేసి.. దేశాధ్యక్షుడు నికొలస్ మదురో, ఆయన భార్యను US సైన్యం బంధించి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ రక్షణను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వ పరిపాలన ముందుకు సాగడం కోసం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.