GNTR: ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2026 ఫిబ్రవరి 13న రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. ఆయా బార్ అసోసియేషన్ ప్రాంగణాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ మేరకు శనివారం బార్ కౌన్సిల్ సెక్రటరీ బి. పద్మలత అధికారిక ప్రకటన జారీ చేశారు. న్యాయవాదులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.