GDWL: సైబర్ మోసాలకు గురైన బాధితులకు గద్వాల్ జిల్లా పోలీసులు అండగా నిలిచారు. వివిధ కేసుల్లో పోగొట్టుకున్న రూ.2.46 లక్షలను రికవరీ చేసి బాధితులకు తిరిగి చెల్లించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మల్దకల్ పీఎస్ పరిధిలో ఓ బాధితురాలు కోల్పోయిన రూ.1.80 లక్షల్లో రూ.1 లక్షను విజయవంతంగా రిఫండ్ చేశారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.