SKLM: హిరమండలం మండలం బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు రెల్ల ఢిల్లేశ్వ రావు (26) మృతి చెందారు. ఇవాళ తెల్లవారు జామున గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దీంతో గ్రామంలో విషద ఛాయలు అలుముకున్నాయి. ఢిల్లేశ్వరావు మృతి పట్ల పార్టీ జిల్లా అధ్యక్షుడు తేజేశ్వర రావు సంతాపం తెలిపారు.