SKLM: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో 57 ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో టైప్-3 పోస్టులు 30, టైప్-4 పోస్టులు 27 ఉన్నాయి. ఇవాళ నుంచి జనవరి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు పేర్కొన్నారు. సమగ్ర శిక్ష కార్యాలయంలో దరఖాస్తులు అందచేయవలసి ఉంటుందని తెలిపారు.