ADB: గంజాయి పండించిన, అమ్మిన ప్రభుత్వ పథకాలు రద్దు చేయడం జరుగుతుందని జిల్లా SP అఖిల్ మహాజన్ బుధవారం తెలిపారు. సిరికొండ మండలంలోని నారాయణపూర్, గజిలి గ్రామంలో రూ.6.4 లక్షల విలువగల గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సీసీఎస్ బృందం సహకారంతో గంజాయి లభ్యమైనట్లు వెల్లడించారు. నిందితులు దేవరావు, సీత బాయిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.