నటుడు దర్శన్ బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలు పరిస్థితులపై న్యాయమూర్తి ముందు వాపోయాడు. రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దర్శన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరయ్యాడు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. గదిలో దుర్వాసన, ఫంగస్ తీవ్రతతో జీవించడం దుర్భరంగా ఉందని ఫిర్యాదు చేశాడు. సూర్యరశ్మి కూడా చూడలేకపోతున్నానని, ఇలాంటి పరిస్థితుల్లో బతకలేనని.. తనకు విషమివ్వమని కోరాడు.