NLG: గోమాత మందిరం, వారాహి దేవి, దక్షిణామూర్తి ఆలయాల నిర్మాణం కోసం నకిరేకల్ పట్టణానికి చెందిన పొదిలి కరుణాకర్ రమాదేవి దంపతులు సోమవారం రూ. 10 వేలు విరాళంగా అందించారు. నల్గొండలోని అన్వేశ్వరమ్మ గుట్టపై ఈ ఆలయాలను నిర్మిస్తున్నారు. హిందూ సంస్థ అధ్యక్షురాలు ఉమాభారతి, దాతల కుమారుడు రాజా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.