KRNL: పెద్దకడబూరులో సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించొద్దని వారు డిమాండ్ చేశారు. సీపీఎం మండల కార్యదర్శి తిక్కన్న మాట్లాడుతూ.. ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులపై రూ.5 వేల కోట్ల భారం మోపిందన్నారు.