KRNL: పెద్దకడబూరు మండలం తారాపురానికి చెందిన రైతు పెద్ద అంజినయ్య అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. రూ.35 వేల పెట్టుబడి పెట్టి, ఎకరానికి ఐదున్నర ప్యాకెట్లు విత్తనాలు నాటి 19.2 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. రూ.1.22 లక్షల ఆదాయంతో రూ.87 వేల నికర లాభం పొందారు. ఈ కృషికి పత్తి పరిశోధన సంస్థ నాగ్పూర్ పురస్కారం అందించింది.