ATP: గుత్తిలోని జండా కట్ట వీధిలో సోమవారం రాత్రి భక్తిశ్రద్ధలతో మిలాద్ ఉన్ నబీ (మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకల సందర్భంగా) ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా జండా కట్ట ఆవరణలో ప్రత్యేక చక్కెర చదివింపులు, ఖురాన్ సూక్తులు పాటించారు. జండా కట్ట నిర్వాహకులు జాకీర్ మాట్లాడుతూ.. ఈనెల 25 నుంచి సెప్టెంబర్ 4 వరకు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయన్నారు.