MLG: ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల ఆర్ట్ టీచర్ రమేశ్ సోమవారం ఆదివాసీ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా లీఫ్ కార్వింగ్ ఆర్ట్ ద్వారా రావి ఆకుపై బిర్సా ముండా చిత్రాన్ని గీసి ఘనంగా నివాళులర్పించారు. గతంలో ఈ కళాత్మక నైపుణ్యంతో రమేష్ పలువురు ప్రముఖుల చిత్రాలు గీసి అవార్డులు, రివార్డులు అందుకున్నారు.