GNTR: చిరుద్యోగుల జీతాలు ప్రతినెల మొదటి వారంలో చెల్లించాలని సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై.నేతాజీ డిమాండ్ చేశారు. ఏప్రిల్ నెల మూడు వారాలు దాటినా మార్చి నెల జీతాలు ఆశా వర్కర్లు, వీఆర్ఏలకు నేటి వరకు చెల్లించలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ పథకంలో పనిచేస్తున్న చిరు ఉద్యోగులకు 12 నెలలు జీతాలు బకాయి ఉందన్నారు.