SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం ఆర్ఓబీ నిర్వాసితులకు లాటరీ ద్వారా ఇల్లు పట్టాలు పంపిణీ కార్యక్రమం అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష హాజరయ్యారు. నిర్వాసితులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. రైల్వే నిర్వాసితులకు సూది కొండ లేబర్ కాలనీ దగ్గర పట్టాలు ఇచ్చామన్నారు.