AP: సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో సహకారం కోసం గేట్స్ ఫౌండేషన్‌తో కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం ఒంటి గంటకు బిల్‌గేట్స్‌తో ఆయన భేటీ కానున్నారు. వారిద్దరి సమక్షంలో ఆరోగ్య సంరక్షణ, విద్య, పరిపాలన, వ్యవసాయం, ఉపాధి రంగాల్లో అవగాహన పత్రంపై సంతకాలు జరుగుతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.