NZB: జిల్లా కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ ఒకరికి నాలుగు రోజుల జైలు శిక్ష విధిస్తూ బుధవారం మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చినట్లు 2 టౌన్ ఎస్ఐ తెలిపారు. ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్లో అంబర్ పేటకు చెందిన కాంతపు సూరజ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, నాలుగు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.