ELR: చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం శివారు మొక్క జొన్న ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న రాళ్ల గుట్ట దగ్గర సైకిల్ పై నాటు సారా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని ఎక్సైజ్ సీఐ అశోక్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. సదరు వ్యక్తి నుండి 2 లీటర్ల నాటు సారా సీజ్ చేశామన్నారు. అనంతరం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.