ADB: ప్రభుత్వం అందజేసే వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్య అధికారి డా.నిఖిల్ రాజ్ తెలిపారు. భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని పలు గ్రామాల్లో బుధవారం పర్యటించారు. వర్షాకాలం నేపథ్యంలో అంటు రోగాలు ప్రబలకుండా చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచించారు. వైద్య విస్తరణాధికారి జ్ఞానేశ్వర్, తదితరులున్నారు.