WNP: కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు వనపర్తి కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. ఆంజనేయులు, రాజు, శారద మాట్లాడుతూ.. ఎన్నికల ముందు అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. వెంటనే డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.