VZM: దత్తిరాజేరు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. ఇందులో ప్రధానంగా వేసవిని దృష్టిలో పెట్టుకుని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సింహాద్రి అప్పలనాయుడు, జెడ్పీటీసీ రౌతు రాజేశ్వరి, వైస్ ఎంపీపీ మిత్తిరెడ్డి రమేశ్ నాయుడు పాల్గొన్నారు.