SDPT: అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన బాకీ బిక్షపతి ఇల్లు షార్ట్ సర్క్యూట్తో దగ్ధం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా BRS సీనియర్ నాయకులు చింతల కుమార్, నాయకులు శనివారం బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రూ 10 వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధైర్య పడొద్దని అండగా ఉంటామని భరోసా కల్పించారు.