ప్రకాశం: జిల్లాను కుష్టువ్యాధి రహితంగా మార్చేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. శుక్రవారం ఒంగోలులోని స్థానిక ప్రకాశం భవనంలో వైద్య అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.