ప్రకాశం: కొండపి MPP కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం జరుగుతుందని కొండపి ఎంపీడీవో రామాజనేయులు తెలిపారు. గ్రామాల్లో జరిగిన ఉపాధి హామీ పనులపై సమీక్ష జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అధికారులు, అన్ని గ్రామల ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఎంపీడీవో రామాంజనేయులు కోరారు.