KNL: తల్లి, కుమార్తెలను ఆత్మకూరు పోలీసులు కాపాడారు. ఆత్మకూరు మండలం సిద్దాపురం గ్రామానికి చెందిన మేరీ, ఈశ్వర్ గొడవ పడగా మేరీ పుట్టింటికి వెళ్లింది. అయినా మరోసారి భార్యాభర్తలు గొడవపడటంతో తన కుమార్తెలు రేణుక, నవీనలను తీసుకుని చనిపోతానని చెప్పి వెళ్లడంతో ఆమె తల్లి ఆత్మకూరు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. ఫోన్ లొకేషన్ ఆధారంగా శ్రీశైలంలో ఉన్నట్లు గుర్తించారు.