TPT: వరదయ్యపాలెం మండలంలో మంగళవారం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పర్యటించనున్నట్లు మండల ఐటీడీపీ అధ్యక్షులు నందనం శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం 11 గంటలకు మండల కేంద్రంలోని గోవర్ధనపురం హైస్కూల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.