రేగు పండ్లను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. డయబెటిస్ ఉన్నవారికి ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. పొట్ట దగ్గర కొవ్వు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు. ఈ పండ్లలో న్యూరో ప్రొటెక్టివ్ గుణాలు ఉంటాయి. దీంతో నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అందువల్ల ఆందోళన, కంగారు వంటి సమస్యలు తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. రాత్రిపూట నిద్ర చక్కగా పడుతుంది.