WGL: హసన్పర్తి బాలికల జూనియర్ గురుకుల కళాశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. కళాశాలలో మత ప్రచారం చేస్తున్నారని కొంతమంది వ్యక్తులు వేడుకలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కళాశాలలో ప్రతి సంవత్సరం అన్ని మతాలకు సంబంధించిన వేడుకలను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఇందుమతి తెలిపారు. ఈ ఘటనలో ఫర్నిచర్ ధ్వంసం అయిందన్నారు.