విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏపీఐఐసీ కాలనీలో గురువారం ఇంట్లో గ్యాస్ లీక్ అవడంతో జరిగిన అగ్ని ప్రమాదంలో భార్గవి(27) తీవ్రంగా గాయపడింది. స్థానికులు కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం మహిళ మృతి చెందింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ పవన్ కిషోర్ తెలిపారు.