TG: రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల్లో బీసీ కమిషన్ బహిరంగ విచారణ పూర్తి అయింది. నేడు హైదరాబాద్లో బీసీ కమిషన్ బహిరంగ విచారణ జరపనుంది. ఇప్పటికే బీసీ కమిషన్ను 1,250 వినతులు సమర్పించారు. బీసీలకు జనాభా దామాషా రిజర్వేషన్లపై భారీగా వినతులు అందాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి చేర్పాలని కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.