»Allu Arjun Multiplex Aaa Cinemas At Ameerpet Hyderabad Open Soon
Allu Arjun Multiplex: AAA సినిమాస్ త్వరలో ప్రారంభం
హైదరాబాద్(hyderabad) అమీర్ పేట(ameerpet)లో ఏషియన్ సినిమాస్‌తో కలిసి అల్లు అర్జున్(Allu Arjun) సొంతంగా మల్టీప్లెక్స్(Allu Arjun Multiplex) నిర్మిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం నిర్మాణం ప్రారంభించిన థియేటర్ కరోనా కారణంగా ఆగింది. కానీ ఇప్పుడు ఇది దాదాపుగా పూర్తైనట్లు తెలిసింది. ఈ క్రమంలో త్వరలో ప్రారంభించనున్నట్లు సమాచారం.
పుష్ప మూవీ సక్సెస్ తర్వాత స్టార్ హీరో అల్లు అర్జున్(Allu Arjun)కు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. అంతేకాదు ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో పెద్ద సక్సెస్ సాధించడంతో ప్రస్తుతం అతిపెద్ద స్టార్లలో అల్లు అర్జున్ ఒకరిగా మారారు. ఇప్పుడు అందరి దృష్టి అతని కొత్త చిత్రం పుష్ప 2పై ఉంది. అల్లు అర్జున్ కూడా అదే షూటింగ్‌ని ప్రారంభించాడు. రాబోయే కొద్ది రోజుల్లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించనున్నాడు. మరోవైపు అటు సినిమాలు చేస్తూనే థియేటర్ వ్యాపార రంగంలోకి అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చారు.
ఈ క్రమంలో హైదరాబాద్(hyderabad) అమీర్ పేట(ameerpet)లో ఏషియన్ సినిమాస్‌తో కలిసి అల్లు అర్జున్ సొంతంగా మల్టీప్లెక్స్(Allu Arjun Multiplex) నిర్మిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం నిర్మాణం ప్రారంభించిన థియేటర్ కోవిడ్ కారణంగా నిలిచిపోయింది. కానీ ఇప్పుడు ఇది దాదాపుగా పూర్తిగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సమ్మర్ చివరి నాటికి దాని కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు తెలిసింది. అంతేకాదు ఈ థియేటర్లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని సమాచారం. మల్టీప్లెక్స్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా అల్లు అర్జున్ లైఫ్ సైజు విగ్రహం ఉండబోతోందనే గాసిప్ కూడా ఉంది. ఇదే నిజమైతే థియేటర్ ప్రధాన ఆకర్షణగా మారనుంది.
దీంతోపాటు ఈ మల్టీప్లెక్స్‌లో పూర్తి LED ప్రొజెక్షన్ స్క్రీన్‌తో కూడిన థియేటర్ ఉంటుంది. సౌత్ ఇండియాలో ఇలాంటి సౌకర్యం ఉన్న రెండో థియేటర్ ఇది. AAA సినిమాస్ అని పేరు పెట్టబడిన ఈ మల్టీప్లెక్స్ హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ అనే ప్రాంతంలో రద్దీగా ఉండే బైలేన్లలో ఉంది. ఈ ప్రాంతం విద్యార్థులు, ఉద్యోగులతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది. ఈ క్రమంలో ఈ థియేటర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని పలువురు చెబుతున్నారు.
అంతేకాదు అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌కు(Allu Arjun Multiplex) తన సొంత సంతకం కూడా ఉండేలా చూసుకుంటున్నాడు. సీటింగ్ నుంచి అక్కడ లభించే షాపింగ్ సౌకర్యాల హక్కులు, AAA సినిమాల్లో స్టైలిష్ ఇంటీరియర్స్, సౌండ్ సిస్టమ్స్ గురించి కూడా ఆరా తీసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఇవన్నీ అల్లు అర్జున్ AAA సినిమా(AAA Cinemas) థియేటర్ గురించి వార్తలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇలాంటి సౌకర్యాలు ఉన్న థియేటర్ హైదరాబాద్ లోనే ఇదే మొదటిదని అంటున్నారు.