ELR: విద్యార్థి దశ నుంచే పుస్తకాలతో స్నేహం చేయాలని వెటర్నరీ డాక్టర్ బి శిరీష అన్నారు. శుక్రవారం ఉంగుటూరు శాఖా గ్రంథాలయంలో వారోత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని శిరీష ప్రారంభించారు. విద్యార్థులకు నీతి పద్యాల పై పోటీ నిర్వహించారు. ఇందులో గ్రంథాలయ పాలకులు గంగాధర్ రావు, ఉపాధ్యాయులు తూతిక శివయ్య పాల్గొన్నారు.