శ్రీకాకుళం జిల్లా పరిషత్ స్థాయి సంఘం సమావేశం శుక్రవారం నుంచి నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా ఒక ప్రకటనలో వెల్లడించారు. జడ్పీ ఛైర్పర్సన్, ఉపాధ్యక్షులు తదితరుల అధ్యక్షతన ఈ సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందని తెలిపారు. కావున ఈ విషయాన్ని గమనించి సంబంధిత అధికారులు అంతా పూర్తి సమాచారం, అభివృద్ధి నివేదికలతో హాజరుకావాలని సూచించారు.