CTR: పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి సమీపంలోని పేట అగ్రహారం రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే మురళీమోహన్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పేట అగ్రహారం రైతులతో బుధవారం చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ను కలిశారు. గత ఐదేళ్ళుగా పేట అగ్రహారం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని కోరారు.