సత్యసాయి: గుడిబండ మండలంలోని కేజీఎన్ పాల్యంలో ఆర్డీటీ సంస్థ సహకారంతో నిర్మించిన ఇళ్లను ఏటీఎం మీనాక్షి ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పెయిన్ దేశానికి చెందిన 9 మంది దాతల మిత్ర బృందం హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థులు స్పెయిన్ దేశస్తులను ఘనంగా సన్మానించారు. తమకు సహాయం చేసినందుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.