జేఈఈ మెయిన్ ధరఖాస్తు చేసుకునే విషయంలో విద్యార్థులను పేర్ల విషయంలో ఎన్టీఏ ఇబ్బందులు పెడుతుంది. గతంలో పదవ తరగతి సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, ఆధార్ కార్డులో పేర్లపై ఏ మాత్రం తేడా ఉన్నా స్వీకరించదు. దీంతో దేశవ్యాప్తంగా ఫిర్యాదులు అందడంతో సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసింది. పేరులో మార్పు ఏమైనా ఉంటే కొత్త విండోను ఓపెన్ చేసి ఆధార్ కార్డుపై ఉన్న వివరాలతో దరఖాస్తు స్వీకరిస్తామని తెలిపింది.