ఒకప్పుడు కఠినమైన జనన నియంత్రణ చర్యలు చేపట్టిన చైనా ఇప్పుడు అదనపు జనాభా కోసం ఆరాటపడుతోంది. దీనికి ప్రధాన కారణం ఆ దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గడమే. 2035 నాటికి చైనా జనాభాలో మూడింట ఒక వంతు 60 ఏళ్ల పైబడిన వారు ఉంటారని ‘వ్యూ’ రీసెర్చ్ నివేదిక తెలిపింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జనాభా పెంచడానికి అధికారులు మహిళలకు ఫోన్ చేసి ‘మీరు ప్రెగ్నెంటా? ఇంకో బిడ్డను కనొచ్చు కదా’ అని అడుగుతున్నారు.