NLR: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసు అధికారులపై వేటు వేసినట్లు SP కృష్ణ కాంత్ తెలిపారు. నెల్లూరులో ఓ వ్యక్తిపై పొక్సో కేసు నమోదు అయింది. ఆయనను ఎస్కార్ట్ పోలీసులు జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో నిందితుడిని ఆయన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ నిందితుడికి, ఆయన భార్యకు వాగ్వాదం జరిగింది. దీంతో ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేసింది.