SRD: నారాయణఖేడ్ పట్టణం నుంచి తమిళనాడులోని అరుణాచలం క్షేత్రానికి స్పెషల్ బస్సు సౌకర్యం కల్పించినట్లు ఖేడ్ DM మల్లేశం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 13న బుధవారం సాయంత్రం 4 గంటలకు ఇక్కడి నుంచి బస్సు బయలుదేరుతుందని చెప్పారు. మూడు రోజుల ప్రయాణం రానుపోను బస్ చార్జీలు ఒక్కొక్కరికి రూ.4500 ఉందని చెప్పారు. వెంటనే బుకింగ్ చేసుకోవాలని కోరారు.