TG: రెండో దశలో 76.4 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణానికి అనుమతి లభించింది. ప్రభుత్వం రూ.24,269 కోట్ల వ్యయంతో మెట్రో రెండో దశ పనులు చేపట్టనుంది. ఈ నిర్మాణానికి సంబంధించి జీవో 196ను తెలంగాణ సర్కార్ జారీ చేసింది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యం కానున్నాయి. రాష్ట్ర వాటా రూ.7,313 కోట్లు, కేంద్రం వాటా రూ.4,230 కోట్లు వెచ్చించనున్నాయి.