TG: సీతారామ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై అధికారులు, ఇంజినీర్లతో కలిసి మంత్రులు ఉత్తమ్, తుమ్మల సమావేశం ఏర్పాటు చేశారు. సీతారామ పనుల్లో రానున్న 6 నెలలు కీలక సమయం అని, త్వరగా పనులు చేస్తే పంటకాలానికి నీరందించే అవకాశం ఉందని తుమ్మల వెల్లడించారు. నిధులు, పరిపాలన అనుమతులు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని, అధికారులు త్వరితగతిన పనులు చేపట్టాలని ఉత్తమ్ తెలిపారు. ప్రతి 15 రోజులకు పనులపై వివరాలు అందించాలని ఆదేశించారు.