అధికారుల కళ్లుగప్పి ఓ వ్యక్తి వారం రోజులు బ్రెజిల్ ఎయిర్‌పోర్టులోనే ఉన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హర్యానాకు చెందిన గౌరవ్ అనే వ్యక్తి ఢిల్లీ నుంచి సావోపాలో (బ్రెజిల్) మీదుగా బోలీవియా చేరుకోవాలి. రిటర్న్ టికెట్ లేనందున ఎయిర్పోర్ట్ సిబ్బంది అనుమతించలేదు. దీంతో వారం రోజుల పాటు ఎయిర్‌పోర్ట్‌లో ఉండి నకిలీ పాస్‌పోర్ట్‌తో కొలంబియా వెళ్లేందుకు ప్రయత్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.