NLR: మనుబోలులో దీపం 2.0 పథకాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తోందన్నారు. ఈ పథకం అమలుకు తమ ప్రభుత్వం రూ.894 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు.