CTR: సూళ్లూరుపేట పట్టణంలోని బాపూజీ వీధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నగదు అందజేశారు. ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు చెప్పిన విధంగా సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చేలా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా1వ తేదీ నాటికే లబ్ధిదారులకు పింఛన్ ఇస్తున్నట్లు చెప్పారు.