NRML: తానూర్ మండలంలోని జురిబి గ్రామానికి చెందిన సవిత కుటుంబానికి శుక్రవారం మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.26వేల చెక్కును అందజేశారు. ఆపద సమయంలో తమ కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసి సహాయం చేశారని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవిదాస్ దిగంబర లక్ష్మణ్, సాయినాథ్ తదితరులు ఉన్నారు.