KKD: కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారిగా జె.వెంకట్రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన గతంలో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటి వరకు డీఆర్ఓగా పనిచేసిన డి.తిప్పే నాయక్‌ను హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. మరో రెండు రోజుల్లో డీఆర్ఓగా వెంకట్రావు బాధ్యతలు చేపట్టనున్నారు.