SRD: జిల్లా కేంద్రంలో ప్రతిరోజు సాయంత్రం సమయంలో పట్టణంలోని ప్రధాన కూడలి బస్టాండ్ సమీపంలో నిత్యం ద్విచక్ర వాహనాలు, కార్లు రోడ్లపైనే నిలపడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు మాత్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు, ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.