AP: తిరుపతిలోని శిల్పారామంలో జాతీయ హిందూ ధార్మిక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామీజీలు, సాధువులు, హిందూ సంఘాల నేతలు పాల్గొన్నారు. ‘తిరుపతి క్షేత్రంలో మద్యం, మాంసం లేకుండా టెంపుల్ సిటీగా చేయాలి. పుణ్యక్షేత్రాల్లో గోపత్యలు, అన్యమత ప్రచారాలు లేకుండా చట్టం చేయాలి. దేశవ్యాప్తంగా సనాతన ధార్మిక బోర్డుల ఏర్పాటు చేయాలి’ అని హిందూ సంఘాల నేతలు తీర్మానం చేశారు.