VZM : గుణుపూరుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వతరగతి చదువుతున్న ఆబోతుల తేజశ్వని, రవిచంద్ర అండర్ -14 కేటగిరిలో, డొప్ప మణిధర్మ తేజ, నవ్య అండర్ -17 కేటగిరిలో రాష్ట్ర స్థాయిలో జరగబోయే బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు సారిపల్లి గౌరీ శంకర్ తెలిపారు. ఈ సందర్బంగా విద్యార్థులను ప్రధానోపాధ్యాయిని కృష్ణ కుమారి అభినందించారు.