తొలి టెస్టులో వికెట్ కీపింగ్ చేస్తూ రిషభ్ పంత్ గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతను రెండో టెస్ట్ ఆడటంపై అనుమానాలు వచ్చాయి. అయితే రెండో టెస్టు ఆడేందుకు పంత్ ఫిట్‌గా ఉన్నాడని భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్ చేట్ చెప్పారు. శుభ్ మన్ గిల్ కూడా ఫిట్‌గా ఉన్నాడన్నాడు. కాగా, జట్టులో ఆరు స్థానాల కోసం ఏడుగురు పోటీపడుతున్నారని చెప్పారు.