NLR: కావలి పట్టణంలోని ఓ మున్సిపల్ పాఠశాలలో పనిచేస్తున్న యువతి పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. యువతికి కుటుంబ సభ్యులు హైదరాబాదులో ఓ పెళ్లి సంబంధం చూసి ముహూర్తాలు పెట్టుకున్నారు. పెళ్లి ఇష్టం లేదని ఆ యువతి కుటుంబ సభ్యులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.